అక్కడ కూడా అదరగొట్టిన నాని 'శ్యామ్ సింగరాయ్' మూవీ..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  నాని ఎన్నో విజయవంత మైన సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాని తాజాగా నటించిన నాని 'శ్యామ్ సింగరాయ్'  సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.  నాని 'శ్యామ్ సింగరాయ్'  సినిమా కంటే ముందు నటించిన వి ,  టక్ జగదీష్ మూవీ లు నేరుగా 'ఓ టి టి'  లో విడుదలయ్యాయి.  శ్యామ్ సింగరాయ్ సినిమా మాత్రం నేరుగా థియేటర్ లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.  ఇది ఇలా ఉంటే శ్యామ్ సింగరాయ్ మూవీ లో సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్ లుగా నటించారు.

సాయి పల్లవి ఈ సినిమా లో దేవదాసి పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది.  కృతి శెట్టి ఈ సినిమా లో కాస్త బోల్డ్ గా కనిపించి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో మడోనా సబాస్టియన్ నటించింది. శ్యామ్ సింగరాయ్ మూవీ కి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించగా మిక్కీ జే మేయర్ ఈ సినిమా కు సంగీతాన్ని సమకూర్చాడు.  ఇది ఇలా ఉంటే థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న శ్యామ్ సింగరాయ్ మూవీ తాజా గా జెమినీ టీవీ లో ప్రసారం అయ్యింది. జెమినీ టీవీ లో తాజాగా ప్రసారం అయిన శ్యామ్ సింగరాయ్ మూవీ 6.87  'టి ఆర్ పి'  ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.  థియేటర్ లలో మంచి విజయం సాధించిన శ్యామ్ సింగరాయ్ మూవీ టీవీ లలో కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: