కే జి ఎఫ్-2 చిత్రం ఒక చెత్త సినిమా అంటున్న హీరో..!!

Divya
దక్షిణాది చిత్రాలలో చాలా సంవత్సరాల తరువాత ప్రస్తుతం సగర్వంగా కొన్ని చిత్రాలు చాటుకుంటూ అనేక విజయాలను సృష్టిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే భారతీయ సినిమా అంటే.. బాలీవుడ్ వర్గాలు పోటీపడి మరీ తెరకెక్కిస్తున్నారు. బాహుబలి, rrr వంటి చిత్రాలతో ఈ విషయం బాగా ఫిక్స్ అయినది. తాజాగా కే జి ఎఫ్ చాప్టర్-2 సినిమా కూడా ఇదే పంతాన్ని కొనసాగిస్తున్నది. ఇక దక్షిణాది చిత్రాలు విడుదలైతే.. చాలు ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ ఉంటారు.

అయితే ఏ సినిమా విడుదల అయినప్పటికీ కూడా కొంతమంది చెత్త సినిమాలు అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ క్రిటిక్ కెఆర్కె కేజిఎఫ్ చిత్రం పై విరుచుకుపడ్డారు. ఈ సినిమా ఒక చెత్త సినిమా అంటూ తన సోషల్ మీడియాలో ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది. దాదాపుగా ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చూశారు. ఇక తాజాగా ఈచిత్రం 5 భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పై బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

RRR సినిమా విడుదల సమయంలో కూడా ఈ సినిమా చాలా చెత్తగా ఉందని.. చెత్త సినిమాని డైరెక్టర్ రాజమౌళి తీశారని అతన్ని జైల్లో పెట్టాలని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక కే జి ఎఫ్ చాప్టర్-2 చిత్రంపై కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయడంతో హీరో యశ్ అభిమానులు కోపంగా ఉన్నారు. కే జి ఎఫ్ సినిమా లో అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదని దిమాక్ ఖరాబ్ అవుతోందని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త నెట్టింట్లో వైరల్ గా మారుతున్నది. దీంతో కె.ఆర్కె ని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: