వంశీ పైడిపల్లిని కార్నర్ చేసిన విజయ్ కామెంట్స్ !

Seetha Sailaja

తమిళ సినిమా రంగంలో రజినీకాంత్ తరువాత ఆస్థాయిలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. రజనీకాంత్ లానే విజయ్ అభిమానులు కూడ అతడిని రాజకీయాలలోకి రమ్మని అభిమానులు నానా హడావిడి చేస్తున్నారు. అయితే విజయ్ మాత్రం ఈవిషయాల పై తన స్పందన తెలపకుండా వారసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.


ప్రస్తుతం విజయ్ కి తెలుగు రాష్ట్రాలలో కూడ మంచి క్రేజ్ ఏర్పడింది. ఈవారం అతడు నటించిన ‘బీస్ట్’ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఏమూవీ ఫలితం ఇంకా తేలకుండానే అతడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న ఒక భారీ సినిమా ఈమధ్యనే చెన్నైలో అత్యంత ఘనంగా ప్రారంభం అయింది.


దీనితో విజయ్ టాలీవుడ్ ఎంట్రీ చాలా ఘనంగా ప్రారంభం అవ్వబోతోంది అంటూ అంచనాలు రావడమే కాకుండా అతడి ఎంట్రీ వల్ల మన టాప్ హీరోలకు కూడ ఘట్టి పోటీ ఉంటుంది అంటూ అంచనాలు వచ్చాయి. ఈమధ్య ఈవారం విడుదల కాబోతున్న ‘బీష్ట్’ మూవీ ప్రమోషన్ లో తన టాలీవుడ్ ఎంట్రీ గురించి విజయ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అందరు అనుకుంటున్నట్లుగా తాను వంశీ పైడిపల్లితో చేస్తున్న మూవీ ‘ఇది బై లింగ్యువల్’ మూవీ కాదని తన గత సినిమాలు లానే ఈమూవీ కూడ తెలుగులో డబ్ అవుతుంది అంటూ కామెంట్స్ చేసాడు.


ఇప్పుడు విజయ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చాలామంది దృష్టి వరకు రావడంతో విజయ్ దృష్టిలో స్ట్రైట్ తెలుగు సినిమా చేయడం అంటే ఒక పనికిరాని విషయం అనుకున్నాడా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని విజయ్ లాంటి హీరోలను తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆదరించాలి అంటూ కొందరు సెటైర్లు కూడ వేస్తున్నారు. అనుకోకుండా విజయ్ నోటివెంట వచ్చిన ఈ కామెంట్స్ పట్ల తెలుగు ప్రేక్షకులు అసహనంలో ఉన్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: