మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుండగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతోంది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆచార్య మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండటానికి ప్రధాన కారణం, మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహ రెడ్డి' లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఆచార్య సినిమాలో హీరోగా నటించడం, అలాగే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించడంతో ఆచార్య సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న ఆచార్య సినిమాను ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటె ఆచార్య సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఆచార్య చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఆచార్య సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటలకు 21.86 మిలియన్ వ్యూస్ ను సాధించింది. అలాగే ఆచార్య మూవీ ట్రైలర్ విడుదలైన 24 గంటలకు 838 కే లైక్ లను సాధించింది. ఇలా తాజాగా విడుదలైన ఆచార్య సినిమా ట్రైలర్ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకొని ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఆచార్య సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.