యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25 వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు, ఆర్ ఆర్ ఆర్ సినిమా పనులు ఇప్పటికే ముగియడంతో ఎన్టీఆర్ తన తదుపరి మూవీ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించబోతోంది అని వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే, అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ నుంచి ఆలియా భట్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి కారణంగా ఆలియా భట్, ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఆలియా భట్ స్థానంలో చిత్ర బృందం మరో బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది, జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.