నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదలైన అఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ మూవీ లో అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ , బాలకృష్ణ సరసన కథానాయికగా నటించింది , ఈ సినిమా లో మరో ముఖ్యమైన పాత్రలో పూర్ణ నటించింది, అలాగే ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో శ్రీకాంత్ నటించాడు. అఖండ సినిమా కంటే ముందు వరుస పరాజయాలతో డీలా పడిపోయిన బాలకృష్ణ 'అఖండ' సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు, అఖండ సినిమా మాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది, ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దునియా విజయ్ ఈ సినిమా లో ప్రతినాయకుడి పాత్ర లో కనిపించబోతున్నాడు, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమా లో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం బాలకృష్ణ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తుంది, మూవీ లోని కొన్ని కీలక సన్నివేశాలను అమెరికాలో షూట్ చేయవలసి ఉన్నట్లుగా తెలుస్తోంది. వీసా ఫార్మాలిటీస్ ఇప్పటికే పూర్తి కాగా సమ్మర్ తర్వాత బయలుదేరన్నట్లు తెలుస్తోంది, మిగతా షూటింగ్ మొత్తం కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనున్నట్లు సమాచారం, బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.