అక్కడ వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఏజెంట్..!
ఇదిలా ఉండగా ఈ సినిమాను అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్ వారు అలాగే సురేందర్ టు సినిమా బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను వైజాగ్ పోర్ట్ లో ప్రారంభించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించనున్నారు. షూటింగ్ లో భాగంగానే వైజాగ్ చేరుకున్న హీరో అఖిల్ కు ఎయిర్పోర్ట్ లో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. అంతేకాదు అఖిల్ ని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చి బైక్ పై భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చూరగొన్నాడు.
ఇకపోతే ఈ స్టేజ్ లో అభిమానులను చూస్తూ ఉంటే అఖిల్ కి ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఇదిలా ఉండగా హై ఓల్టేజ్ స్ప్రై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా తన మేక్ ఓవర్ నే మార్చుకున్నట్లు సమాచారం. తాజాగా అఖిల్ బర్త్డే కి విడుదల చేసిన ఏజెంట్ సినిమా పోస్టర్ చూసి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.మరి ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.