
నాని.. కీర్తి సురేష్ నటిస్తున్న దసరా మూవీ నుంచి అప్డేట్..!!
ఇక ఈ చిత్రం తో పాటుగా దసరా అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు నాని. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నది. నాని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా తెలంగాణలోని గోదావరిఖని లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక పాట అక్కడ షూటింగ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ పాటని rrr చిత్రంలో నాటు నాటు అనే పాటకు స్టెప్పులు వేయించిన ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ అందిస్తున్నట్లు గా తెలుస్తోంది.
ఇక ఈ పాటను కూడా దాదాపుగా 500 మందికి పైగా డ్యాన్సర్ల తో చిత్రీకరిస్తున్నట్లు గా సమాచారం. ఇక ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తుందనే నమ్మకం చిత్ర బృందంలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ నిర్మిస్తున్నారు. నాని కెరియర్లోనే దసరా చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక గత కొద్ది రోజుల కిందట దసరా చిత్రం నుంచి గ్లింప్స్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. ఇందులో నాని మరొకసారి ఒక మాస్ పాత్రలో కనిపించబోతునట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో కొంత మంది నటులు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.