
రాజమౌళి : మహేష్ సినిమా అభిమానులకు ఒక పెద్ద ట్రీట్..!
ఈ సినిమా మార్చి 25న విడుదల అయ్యి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే..
ఇక ఇప్పుడు రాజమౌళి ఫుల్ ఫోకస్ అంతా కూడా మహేష్ బాబు సినిమాపై పెట్టాడు.. రాజమౌళి మహేష్ బాబు తో ఒక భారీ అడ్వెంచర్ సినిమాను తెర మీదకు తీసుకు రాబోతున్నాడట.. ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మాస్ హీరోలు కాబట్టి వాళ్ళను బాగా మాస్ గా చూపించాడు.. అయితే మహేష్ బాబు క్లాస్ హీరో.. అందుకే ఇప్పుడు ప్రతీక్షకులంతా ఈ సినిమా ఎలా ఉంటుందో జక్కన్న మహేష్ బాబు ను ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి అందరిలో నెలకొందట..
కరోనా సమయంలో జక్కన్న కు రెండు నెలలు ఖాళీ సమయం దొరికిందట.
దీంతో ఆ సమయంలో మహేష్ సినిమా స్టోరీ కోసం విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు కూడా జరిపామని రాజమౌళి రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.. ఈయనతో తీసే సినిమా స్టోరీ ఎలా ఉంది? ఏ జోనర్ లో ఉండాలి అని చర్చ జరిగినట్టు తెలిపాడట.లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ ను సెలెక్ట్ చేశారట..
అందులో ఒక స్క్రిప్ట్ మహేష్ కోసం ఫైనల్ చేయనున్నామని తెలిపాడట.. ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కు ఒక ట్రీట్ లాగ ఉంటుందని.. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని ఓ ఎపిక్ గా నిలిచి పోతుందని అభిమానులకు మాట ఇచ్చారట జక్కన్న.. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో..
ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తు ఎంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. దీని తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత జక్కన్న సినిమా స్టార్ట్ చేయనున్నాడని సమాచారం.