ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉండి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు కే జి ఎఫ్ చాప్టర్ 2 , బీస్ట్, ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు, ఆ అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా కూడా భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వ తేదిన విడుదల కాబోతుంది. కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది, అందులో భాగంగా ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను, సాంగ్స్ ని, టీజర్, ట్రైలర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది, ఇది ఇలా ఉంటే కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాకు కేరళలో అదిరిపోయే రెస్పాన్స్ లబిస్తున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లకు కేరళ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఏప్రిల్ 13 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్, ట్రైలర్, పాటలను విడుదల చేసింది, వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది, ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 13 వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కు కేరళలో అదిరిపోయే రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తోంది, బీస్ట్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లకు లకు కేరళ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్లు సమాచారం, ఇలా కే జి ఎఫ్ చాప్టర్ 2 , బీస్ట్ మూవీ లకు కేరళ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.