త్రిబుల్ ఆర్ కి.. మరో అర్థం చెప్పిన జబర్దస్త్ కమెడియన్స్?

praveen
ఇటీవలి కాలంలో వెండితెరపై ఏదైనా సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది అంటే చాలు ఇక ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను బుల్లి తెర పై పలు కార్యక్రమాలలో స్పూఫ్ చేసి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు అన్న విషయం తెలిసిందే   మొన్నటికి మొన్న పుష్ప సినిమా లోని ఎన్నో సన్నివేశాలను పలు చానళ్ల లోని కామెడీ షో లలో స్పూఫ్ చేశారు. ఇలాంటి స్పూఫ్ వీడియో లు ఎన్నిసార్లు చూసినా కూడా పగలబడి నవ్వుతూ ఉంటారు ప్రేక్షకులు. ఇకపోతే ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే  బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక దాదాపు 800 కోట్ల వసూళ్లు సాధించింది అని తెలుస్తోంది.



 మొదట త్రిబుల్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్తో మొదలైన ఈ సినిమాకు ఆ టైటిల్ చివరి వరకు కొనసాగింది. త్రిబుల్ ఆర్ అంటే రాజమౌళి,రామ్ చరణ్,రామారావు అని అందరూ అనుకున్నారు. కానీ ఇక రాజమౌళి త్రిబుల్ ఆర్ కొత్త అర్థం చెప్పాడు అన్న విషయం తెలిసిందే. త్రిబుల్ ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం   అంటూ చెప్పాడు. ఇకపోతే ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం బుల్లితెరపై స్పూఫ్ చేస్తున్నారు. ఇక ఇటీవల జబర్దస్త్ కమెడియన్స్ త్రిబుల్ ఆర్ సినిమా కి కొత్త అర్థాన్ని చెప్పారు.



 ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రోమోలో భాగంగా ఒక స్కిట్ లో త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించి గెటప్ లతో ఎంట్రీ ఇస్తారు అందరు. అంతేకాదు త్రిబుల్ ఆర్ లో ఉన్న కొన్ని డైలాగులు కూడా చెబుతూ ఉంటారు. ఇంతలోనే త్రిబుల్ ఆర్ అంటే ఏంటి అంటూ అడుగుతాడు కమెడియన్ నరేష్. ఇంతలోనే నూకరాజు త్రిబుల్ ఆర్ కి కొత్త అర్థాన్ని చెబుతాడు. హీరోలు చేస్తే రౌద్రం రణం రుధిరం.. ఇక్కడ వీళ్ళు చేసేది మాత్రం రాడ్డు రోత ర్యాంపు అంటూ చెబుతాడూ. దీంతో అక్కడున్న వారందరూ కూడా  పగలబడి నవ్వుకుంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: