రాజమౌళి అగ్రిమెంట్ ను బ్రేక్ చేసిన అమీర్ ఖాన్.. కారణం..?
భారీ విజయాన్ని అందుకున్నందుకు చిత్రం యూనిట్ కు అభినందనలు కూడా తెలిపారు. రాజమౌళి గురించి మాట్లాడుతూ అమీర్ ఖాన్ పై షాకింగ్ కామెంట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ కి.. నాకు మధ్య ఒక ఒప్పందం.. ఇక ఆ ఒప్పందం ఏమిటి అంటే కేవలం పేర్లు పెట్టి మాత్రమే పిలుచుకోవాలని సార్, గారు అనే పదాలు ఉపయోగించుకో కూడదు అని ఇటీవల ఒక అగ్రిమెంట్ కూడా మేం పెట్టుకున్నాము. అయితే అమీర్ ఖాన్ ని సార్ అని కాకుండా ఏకే అని పిలవడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను..
ఇక అమీర్ ఖాన్ ఒత్తిడి చేయడంతో నేను ఆయనను ఏకే అని పిలవడం మొదలు పెట్టాను. కానీ ఇప్పుడు ఆయన మాత్రం మా మధ్య ఉన్న అగ్రిమెంట్ ను బ్రేక్ చేసి నన్ను రాజాజీ అని పిలుస్తున్నారు..అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.ఇక దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు.