డైరెక్టర్ గా మారిన తమిళ్ హీరో.. ఆమెతో కలిసి వెబ్ సిరీస్ ఆరంభం..!!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు హీరోయిన్లు సినిమాల్లో మంచి స్టేజ్ కి వచ్చిన తర్వాత తమ కలలను నెరవేర్చుకుంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది హీరోలు డైరెక్టర్లుగా అవతారం ఎత్తితే.. మరి కొంత మంది నిర్మాతలు గా బాధ్యతలు చేపడుతూ ఉంటారు. ఇక మరికొంతమంది వ్యాపారాలు మొదలు పెడితే.. ఇంకొంతమంది డబ్బు సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం డైరెక్టర్ గా మారి ఒక వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నారు. అది కూడా ఒక అమ్మాయి తో కలిసి నిర్మించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు..? ఆ వెబ్ సిరీస్ ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం.


తమిళనాడు ముఖ్యమంత్రిగా.. సహనానికి మారుపేరు గా ..ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలిచిన.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ .. ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ తాజాగా సినిమా లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక  ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత మొదటి విజయం సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొని ఎంతోమందికి  సహాయం కూడా చేశారు. ఇకపోతే ఈ యంగ్ హీరో స్టార్ హీరోగా ఎదుగుతాడు అని అనుకుంటే.. ఈయన మాత్రం డైరెక్షన్ వైపు అడుగులు వేశారు.

హీరోగా, ఎమ్మెల్యేగా తమిళనాడులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయనిది తన భార్య కృతిక ఉదయనిధి తో కలిసి ఒక వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. పేపర్ రాకెట్ అనే వెబ్ సిరీస్ కి తన భార్యతో కలిసి డైరెక్ట్ చేస్తున్న ఉదయం ఇది త్వరలో ఈ వెబ్ సిరీస్ ను Zee ఫైవ్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఒకేసారి మూడు భాషలలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి డైరెక్షన్ విభాగంలో విజయ పొందుతాడో లేదో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: