వైరల్ అవుతున్న పవన్ కల్యాణ్ కొత్త ఫొటో..
రౌండ్ నెక్ టీ షర్ట్, షార్ట్ వేసుకుని ఉన్న పవన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో పవన్ ఫిజిక్ ఆసక్తికరంగా ఉంది. ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా సినిమా షూటింగ్ మధ్యలో దిగిన ఫొటోనా అనేది తెలియడంలేదు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ కొత్త స్టిల్ మాత్రం కొత్తగా ఉంది. గతంలో ఇలా పవన్ ఎప్పుడూ ఫొటోలు దిగలేదు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
పవన్ స్టైల్ మార్చారా..?
వకీల్ సాబ్ కోసం జుట్టు పెంచిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత భీమ్లా నాయక్ లో కాస్త తగ్గించారు. ఇప్పుడు హరిహర వీరమల్లులో కూడా పవన్ కల్యాణ్ పొడుగు జుట్టుతో కనిపించాల్సి ఉంటుంది. కానీ పవన్ ఇప్పుడు కొత్త స్టైల్ లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. జుట్టుతోపాటు మీసం కూడా పెంచుతున్నారు పవన్ కల్యాణ్. ఈ కొత్త స్టైల్ తో ఇప్పటికే పలు రాజకీయ కార్యక్రమాలకు హాజరయ్యారు. పార్టీ మీటింగ్ లలో కూడా పవన్ ఇలాగే కనిపించారు. అయితే ఈ స్టైల్ లో పవన్ లాల్చీ పైజామాలో ఉన్న స్టిల్స్ ఎక్కువగా బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు టీ షర్ట్ లో పవన్ కొత్త లుక్ మాత్రం ఆసక్తికరంగా ఉంది.
పవన్ కొత్త స్టిల్స్ ని అభిమానించేవారితోపాటు కామెంట్ చేసేవారు కూడా సహజం. ఇప్పుడీ కొత్త స్టిల్ కూడా ఇలాగే వైరల్ గా మారింది. పవన్ ఫిజిక్ ని పొగుడుతూ కొంతమంది పోస్ట్ లు పెడుతుంటే, మరికొందరు మాత్రం నెగెటివ్ కామెంట్లు మొదలు పెట్టారు. పవన్ కల్యాణ్ లుక్ బాలేదంటున్నారు. అభిమానులు మాత్రం పవన్ కొత్త స్టైల్ లోకి మారిపోతున్నారని సంబరపడుతున్నారు.