ఈ వారం థియేటర్ మరియు 'ఓటిటి' లో సందడి చేయబోయే సినిమాలు..!

Pulgam Srinivas
ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్ లలో సందడి చేయబోతుంటే మరి కొన్ని సినిమాలు 'ఓ టి టి' లో సందడి చేయబోతున్నాయి,  అలా ఈ వారం థియేటర్ మరియు 'ఓ టి టి'  లో సందడి చేయబోయే సినిమాల గురించి తెలుసుకుందాం...

గని : వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జానీ సినిమా ఈ నెల 8 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ మూవీ లో ఉపేంద్ర, సునీల్‌శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు,  గద్దల కొండ గణేష్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో గని సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు.    

డేంజరస్‌ : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అప్సరారాణి, నైనా గంగూలీ మెయిన్‌ రోల్స్ పోషించారు,  స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా సాగే ఈ మూవీ టాలీవుడ్‌ లో ఒక కొత్త ప్రయోగమని ఇటీవల రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు, ఈ సినిమా ఏప్రిల్ 8 వ తేదీన విడుదల కాబోతుంది.

మూవీ లతో పాటు రెడ్డిగారింట్లో రౌడీయిజం, బరి, డస్టర్‌, కథ కంచికి మనం ఇంటికి అనే చిన్న మూవీ లు కూడా థియేటర్ లలో విడుదల కానున్నాయి.

'ఓ టి టి'  లో సందడి చేయబోయే సినిమాలు...

స్టాండప్‌ రాహుల్‌ : రాజ్ తరుణ్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా శాంటో మెహన వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రముఖ 'ఓ టి టి' ఆహా లో ఈ నెల 8 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో...
నారదన్‌...మలయాళం...ఏప్రిల్‌ 8.  మర్డర్‌ ఇన్‌ అగోండా...హిందీ... ఏప్రిల్‌ 8.

నెట్‌ఫ్లిక్స్‌...
 చస్వీ...హిందీ... ఏప్రిల్‌ 7.
ఎత్తర్కుం తునిందావన్‌...తమిళ్‌... ఏప్రిల్‌7.
ఎలైట్‌...వెబ్‌ సిరీస్‌...ఏప్రిల్‌ 8.
మెటల్‌ లార్డ్స్‌...హాలీవుడ్‌... ఏప్రిల్‌ 8.
ద ఇన్‌బిట్విన్‌...హాలీవుడ్‌... ఏప్రిల్‌ 8.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌...
ద కింగ్స్‌ మెన్‌...హాలీవుడ్‌...ఏప్రిల్‌ 8.

జీ5...
ఏక్‌ లవ్‌ యా...కన్నడ...ఏప్రిల్‌ 8.
అభయ్‌...హిందీ...ఏప్రిల్‌ 8.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: