బాబోయ్.. హృతిక్ రోషన్ ప్రేయసితో అంతదాకా వెళ్ళాడా?

praveen
ఇటీవలి కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం ఇక విడాకుల తర్వాత మరొకరితో రిలేషన్ షిప్ లో మునిగితేలడం  సర్వ సాధారణం గా మారిపోతుంది అనే చెప్పాలి. ఇదే ఇటీవలే బాలీవుడ్లో ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఎంతో మంది సెలబ్రెటీలు ఇలా కట్టుకున్నవారి నుంచి విడాకులు తీసుకొని ఆ తర్వాత డేటింగ్ లో మునిగితేలుతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సైతం ఇక ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నాడు. తన భార్యతో హృతిక్ రోషన్ విడాకులు తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు మాత్రం ఒక హీరో హీరోయిన్ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడూ అంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.



 యువ హీరోయిన్ సభ ఆజాద్ తో హృతిక్ రోషన్ డేటింగ్లో మునిగి తేలుతున్నాడని.. బాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి కనిపించింది మాత్రం లేదు అని చెప్పాలి. కానీ ఇటీవలే ముంబై ఎయిర్ పోర్టులో ఇద్దరు కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఇక కెమెరాలకు కనిపించడంతో ఇక మొన్నటి వరకు వీరిద్దరి డేటింగ్ లో ఉన్నారు అంటూ వచ్చిన రూమర్లు నిజమే అన్నది ప్రస్తుతం అందరూ నమ్ముతున్నారు. వీరిద్దరి రిలేషన్షిప్ పై ఇన్నాళ్లు వార్తలు రావడం తప్ప ఎక్కడ కన్ఫర్మ్ కాలేదని.. కానీ ఇటీవలే ముంబైలో ఇద్దరు కలిసి కనిపించడం.. అది కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కనిపించడంతో ఇక వీరిద్దరి డేటింగ్లో ఉన్నారు అన్న విషయం కన్ఫార్మ్ అయిపోయింది అని అంటున్నారు నేటిజన్లు.


 ఇక ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన ఫోటోలో హృతిక్ రోషన్ తెల్లటి టీ షర్ట్ లెనిన్ ఫ్యాంట్ లో ఉండగా సభ అజాద్ చేతిలో చేయి వేసుకుని ఎయిర్పోర్టులో కెమెరాకు దొరికిపోయాడు. ఇక ఈ ఫోటో చూసిన తర్వాత ఇంకా పుకార్లు ఎందుకు వీరిద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటూ ఎంతో మంది ఫిక్స్ అయిపోతున్నారు. త్వరలో వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉండటం గమనార్హం. ఇక మొన్నటి వరకు కేవలం మీడియా కంట పడకుండా రహస్యంగానే తిరిగిన  ఈ జంట ఇప్పుడు మాత్రం కెమెరాల ముందు రావడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అన్నది తెలుస్తుంది. చూడాలి ఇక వీరి రిలేషన్ షిప్ ఎంతవరకు వెళ్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: