పవన్ ను ఇమిటేట్ చేస్తున్న చిరంజీవి !

Seetha Sailaja

పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే సమయానికి చిరంజీవి టాప్ హీరో. అయినప్పటికీ పవన్ తన మొదటి సినిమా నుండి ఎక్కడా తన నటన పై కానీ బాడీ లాంగ్వేజ్ లో కానీ చిరంజీవి ప్రభావం లేకుండా తన కెరియర్ ను తీర్చి దిద్దుకున్నాడు. చివరకు మెగా హీరోలందరూ చిరంజీవి సినిమాలలోని పాటలను తమ సినిమాలలో రీ మిక్స్ చేసుకుంటే అలాంటి ప్రయోగం ఎక్కడా తన సినిమాలలో చేయలేదు.



చిరంజీవితో కలిసి పవన్ కళ్యాణ్ ఒక మల్టీ స్టారర్ లో నటిస్తే చూడాలని అభిమానులు కోరుకున్నా ఆకోరికను సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఇప్పుడు చిరంజీవి ఏకంగా పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమాలోని సీన్ ను యధాతధంగా తన సినిమాలో దించబోతున్నాడు అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి.



పవన్ సినిమాలలో బ్లాక్ బష్టర్ హిట్ గా నిలిచినా ‘ఖుషీ’ మూవీలోని ఒక సీన్ ను దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవితో తీస్తున్న ‘భోళాశంకర్’ మూవీలో పెడుతున్నట్లు టాక్. ‘ఖుషీ’ మూవీలో పవన్ భూమిక ల మధ్య ఒక రొమాంటిక్ సన్నివేశాన్ని హాస్యంగా తీసారు. భూమిక తన బొడ్డును పవన్ కళ్యాణ్ చూసాడు అంటూ తెగ గొడవ పెట్టుకుంటుంది.


ఇప్పటికీ ఆ సీన్ అందరికీ గుర్తు ఉంటుంది ఇప్పుడు అదే సీన్ ను చిరంజీవి శ్రీముఖి ల మధ్య తీయబోతున్నారట. ‘భోళాశంకర్’ మూవీలో వచ్చే సన్నివేశంలో శ్రీముఖి ‘నువ్వు నా బొడ్డు చూసావ్ అని శ్రీముఖి’ అంటే ‘అసలు అక్కడ బొడ్డు ఎక్కడుంది అన్నీ ముడతలేగా అని మెగాస్టార్ ఫన్నీగా మాట్లాడుకునే సీన్ ప్లాన్ చేసారట. మెగా స్టార్ చిరంజీవి తనకు 67 సంవత్సరాలు వచ్చినప్పటికీ తాను ఇంకా రొమాంటిక్ వ్యక్తిని అని నేటి తరానికి చెప్పడానికి బహుశా ఈ సీన్ పెట్టి ఉంటారు. ఏది ఎలా ఉన్నా చిరంజీవి పవన్ కళ్యాణ్ సీన్ ను ఇమిటేట్ చేయడం పవర్ స్టార్ అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: