వర్మ మెడకు బిగుసుకున్న మరో వివాదం..?

Satvika
సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వాళ్ళు అస్సలు వుండరు.. ఒకప్పుడు మంచి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. ఎందరో స్టార్ హీరోలకు మంచి లైఫ్ ను అందించిన ఘనత వర్మకే సొంతం. అలాంటి వర్మ ఈ మధ్య వివాదాలకు కెరాఫ్ గా నిలుస్తున్నారు..సోషల్ మీడియా వెధికగా ప్రతి ఒక్కరిని గెలుకుతూ వార్తల్లొ నిలుస్తారు. ఇకపోతే ఆయన సినిమాలు కూడా వివాదాలను తెచ్చుకుంటాయి.. రాజకియాలకు సంబంధించిన సినిమాలను వర్మ తెరకెక్కించారు. కొన్ని పరిస్థితుల చుట్టూ తిరిగి చివరికి విడుదల అయ్యాయి. అలా కొద్ది రోజులకే అడ్రెస్ లేకుండా పోయాయి.


ఎన్ని పరిస్థతులు ఎదురైనా సినిమాలు చేయడం వర్మ స్టైల్..ప్రస్తుతం వర్మ మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. డేంజరస్' అనే మూవీని తీశారు.ఈ సినిమా ఒక లెస్బియన్ లవ్ స్టోరీతో యాక్షన్, క్రైం అంశాలని కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో నైనా గంగూలీ, అప్సర రాణి మెయిన్ లీడ్స్ లో నటించారు. 'డేంజరస్' సినిమాని ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ సినిమా ప్రమోషన్స్ ను కూడా బాహుబలి రేంజ్ లో ప్లాను చెస్తున్నారు.. ఎక్కడ చూసిన ఈ సినిమా పేరు వినిపిస్తుంది.


ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా ఇప్పుడు ఒక వివాదం లో చిక్కుకుంది.దాంతో వర్మకు మస్తు కోపం వచ్చింది.ఈ సినిమాని PVR సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ వాళ్ళ థియేటర్లలో ప్రదర్శించడానికి తిరస్కరించాయి.. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశారు.నా సినిమా డేంజరస్ ని లెస్బియన్ కథాంశం అని దాన్ని ప్రదర్శించడానికి నిరాకరించడం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమే. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం నేరం.. అన్నీ హక్కులను పొందిన సినిమా పై ఇలా వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇలాంటివి ప్రభుత్వం సపోర్ట్ చెయ్యకూడదు..మానవ హక్కులను అవమానించడమే' అని పోస్ట్ చేశారు.. వర్మ సినిమాను ఆ సినిమా హాల్లు ప్రదర్శిస్తాయా లేదా చూడాలి. ఈ సినిమా ఏప్రిల్ 8న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: