యశోద వచ్చేది అప్పుడేనా?
సామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా యశోద.. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి - హరీష్ కొత్త దర్శకులుగా పరిచయం అవుతున్నారు.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.. ఇందులోని కీలక సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. లేడి ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా రానుందని చిత్రయూనిట్ వెల్లడించారు.. సామ్ ఆ సినిమా లో ఎలా కనిపిస్తుంది అనే ఆసక్తి అభిమానులకు కలుగుతుంది.. సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు..
ఇది ఇలా ఉండగా సామ్ అభిమానులకు చిత్రయూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది.ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''సమంత నటన, ఆమెపై తెరకెక్కించిన యాక్షన్ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు..హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం భారీ సెట్లు వేశాం. అందులో చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం కొడైకెనాల్లో కొత్త షెడ్యూల్ మొదలెట్టాం. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తామని అన్నారు. ఇకపోతే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్‌రాజ్, శత్రు తదితరులు ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు.