RRR లో పాత్రలు ఎవరు డిసైడ్ చేశారో చెప్పిన విజయేంద్రప్రసాద్..!!
అయితే సినిమా విడుదలకు ముందే విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. చరణ్ పాత్ర కు ఎన్నో ట్రైల్స్ వేశాము. అలాగే ఎన్టీఆర్ పాత్రకి కూడా అమాయక అడవి బిడ్డ పాత్ర అని తెలిపారు. ఇకపోతే చరణ్ పాత్ర కు ఒక మార్కు ఎక్కువగా వేయొచ్చు అని విజయేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాత్రలను ఎవరు ఎంపిక చేశారు అనే ప్రశ్న రాగా దానికి ఆసక్తికరమైన సమాధానం తెలిపారు విజయేంద్రప్రసాద్.
కొమరం భీమ్ పాత్ర ముందునుండి మొరటుగా ఉండడంతోపాటు అమాయకమైన పాత్ర అటువంటి పాత్రలను ఎట్టి పరిస్థితుల్లో కూడా చరణ్ చేయలేడు.. ఇక రామరాజు పాత్రనైనా ఎన్టీఆర్ చేయగలడు కానీ చరణ్ కళ్ళతో హావభావాలు పలికించగలడు కాబట్టి రామ్ చరణ్ కి అనుకుని.. భీమ్ పాత్రలో అమాయకత్వం స్వచ్ఛమైన మనసు గలవాడిలా ఎన్టీఆర్ ఒదిగి పోతాడని ఆ పాత్ర ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తక్కువగా ఉందని అనుకోవడం చాలా పొరపాటు కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనకు అందరూ బాగా కనెక్ట్ అయ్యారు కదా అని కూడా విజయేంద్రప్రసాద్ తెలిపారు.