అనిల్ రావిపూడి తో కలిసి నాటు నాటు సాంగ్ కి స్టెప్పులేసిన రాజమౌళి..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ని తెరకెక్కించిన విషయం  మన అందరికి తెలిసిందే,  రాజమౌళి,  ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమాను  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.  ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా ఆలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్ లుగా నటించారు,  సముద్ర ఖని,  అజయ్ దేవ్ గన్,  శ్రీయ,  ముఖ్య పాత్రల్లో ఈ సినిమాలో నటించారు,   ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చాడు.  ఇది ఇలా ఉంటే ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25 వ తేదీ న భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలైన ప్రతి చోటి నుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది,  ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వందల కోట్ల కు పైగా కలెక్షన్ లను కూడా సాధించినట్లు తెలుస్తోంది.


  ఇది ఇలా ఉంటే ఒక సందర్భంలో రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్'  మూవీ సక్సెస్ మీట్ లో 'నాటు నాటు' సాంగ్ కు డాన్స్ చేస్తానని తెలియజేశాడు,  ఇది ఇలా ఉంటే రాజమౌళి తాజాగా తన మాటను నిలబెట్టుకున్నాడు.  నిర్మాత దిల్ రాజు ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీ లో దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి నాటు నాటు సాంగ్ కి  రాజమౌళి స్టెప్ లు వేశాడు,  ప్రస్తుతం అనిల్ రావిపూడి తో కలిసి రాజమౌళి  'నాటు నాటు' సాంగ్ కి స్టెప్ లు వేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: