మరోసారి వాయిదా పడనున్న సర్కారు వారి పాట..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే,  సర్కారు వారి పాట సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది,  ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా నుండి రెండు పాటలను చిత్ర బృందం విడుదల చేయగా ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  అలాగే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ కు అలాగే కొన్ని ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది,  ఇది ఇలా ఉంటే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల సర్కారు వారి పాట సినిమా విడుదలను చిత్ర బృందం సంక్రాంతి కి వాయిదా వేసి మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు  అఫీషియల్ గా ప్రకటించింది.


 ఇది ఇలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది,  సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన కూడా విడుదల కావడం కష్టమే అని , ఈ సినిమా మే చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని  కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే మహేష్ బాబు  'సర్కారు వారి పాట'  సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు,  మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: