పాన్ ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో వచ్చి భారీ ఫ్లాప్ ను అందుకున్న విషయం తెలిసిందే. దీనికి ముందు వచ్చిన సాహో కూడా ఫ్లాప్.
ఇలా రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఫ్లాపవడంతో ప్రభాస్ క్రేజ్ అమాంతం తగ్గిపోతుందని అందరూ కూడా భావించారు. కానీ, అది అయితే ఇప్పట్లో జరగని పని అని ప్రభాస్ కమిటవుతున్న సినిమాలను చూస్తేనే అర్థమవుతోంది.. అయితే, ఇక పై మాత్రం ప్రభాస్ తను చేస్తున్న సినిమా ల పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడట..
ప్రస్తుతం చేస్తున్న వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోందట. అలాగే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసే సినిమా, ఇప్పుడు ప్రభాస్ – మారుతి కాంబోలో తెరకెక్కే సినిమా పాన్ ఇండియన్ రేంజ్‌లోనే తెరకెక్కనున్నాయని సమాచారం. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఆదిపురుష్, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ప్రాజెక్ట్ కె సినిమా లు మాత్రం పాన్ వరల్డ్ స్థాయిలో హాలీవుడ్‌లో ను రిలీజ్ కాబోతున్నాయట.అయితే, తాజాగా ఆదిపురుష్ సినిమా కు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో రాముడి పాత్రను చాలా గొప్పగా చూపించబోతున్నారట.. సినిమా చూస్తున్న ప్రేక్షకుల ఊహ కు ఎంతమాత్రం అందని విధంగా సన్నివేశాలను గొప్ప అనుభూతితో చూపించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా అదిపురుష్ సినిమాలో రాముడి పరాక్రమ శైలినే హైలైట్ చేస్తున్నారని తాజాగా దర్శకుడు ఓం రౌత్ స్వయంగా చెప్పు కొచ్చాడు. అంతేకాదు..ఈ సినిమాలో ఉండే విజువల్స్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా చూసి ఉండరని నమ్మకంగా చెబుతున్నారు. మరి దర్శకుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్‌లోనే ఓ మైల్ స్టోన్ సినిమా గా నిలుస్తుందని అర్థమవుతోంది.