టాలీవుడ్ ఇండస్ట్రీపై శృతి హాసన్ ఫుల్ ఫోకస్!

Purushottham Vinay
వరుస హిట్లతో శ్రుతి హాసన్ మాంచి జోష్ మీద ఉందనే చెప్పాలి. ఇక కంబ్యాక్ లో అదరగొట్టి వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తోంది శృతి. లవ్ బ్రేకప్ తరువాత డిప్రెషన్ లోకి వెళ్లి మళ్ళీ బయటపడి ఇప్పుడు ఇంకొకరితో డేటింగ్ చేస్తున్న శృతి హాసన్ గతేడాది క్రాక్ సినిమా తో టాలీవుడ్ కి తిరిగి వచ్చింది.అలాగే ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కం బ్యాక్ సినిమా వకీల్ సాబ్ సినిమాలో కూడా కనిపించింది. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి.దీంతో శృతి హాసన్ కి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వచ్చాయి.ఇక శ్రుతి హాసన్ ప్రాజెక్టులను పరిశీలిస్తే..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి సలార్.. ఇంకా నటసింహం నందమూరి బాలకృష్ణతో ఎన్.బీ.కే 107 .. అలాగే మెగాస్టార్ చిరంజీవి 154లో నటిస్తోంది. ఆమె మరికొన్ని భారీ బడ్జెట్ తెలుగు సినిమాల కోసం కూడా చర్చలు జరుపుతోంది.


టాలీవుడ్ లో బిజీగా ఉన్నా కానీ ఎందుకనో హిందీ తమిళ భాషల్లో పెద్దగా మాత్రం ఈమెకు ఆఫర్లు రావడం లేదు. ఇక రీఎంట్రీలో శృతి హిందీ వెబ్ సిరీస్ లు చేస్తోంది.అలానే ఒక తమిళ చిత్రంలో కూడా నటించింది. ఆ రెండు పరిశ్రమలు శ్రుతి హాసన్ కి పెద్దగా కలిసి రాలేదు. అందుకే తెలుగు సినీపరిశ్రమను ఆమె విడిచిపెట్టడం లేదు. తెలుగు సినిమాల పైనే శృతి ఫుల్ ఫోకస్ పెట్టింది.ఇక తెలుగు చిత్రాలపైనే దృష్టి పెట్టడానికి కారణం అదేనా? అంటూ చర్చ సాగుతోంది. ఇక కమల్ హాసన్ అంటే తెలుగు సినీపరిశ్రమకు కూడా ఎంతో గౌరవం అనే చెప్పాలి. దాని దృష్ట్యా కూడా మన మేకర్స్ శ్రుతి హాసన్ ని ఎంకరేజ్ చేస్తున్నారని భావించాల్సి ఉంటుంది. సినిమాలతో పాటు మరో వైపు గోథిక్ మేకప్ విధానాలకు ప్రచారం చేస్తున్న శ్రుతి హాసన్ వరుస ఫోటోషూట్లతో హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంటలు పుట్టిస్తున్న సంగతి తెలిసినదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: