అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్న అనిల్ రావిపూడి..!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు,  ఈ దర్శకుడు కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదటి సినిమాలోనే అనిల్ రావిపూడి కామెడీ తో ఏక్షన్ ని జతచేసి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు,  ఆ తర్వాత సాయి ధరమ్ తేజ హీరోగా సుప్రీమ్ సినిమాను తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఈ సినిమాలో కూడా కామెడీతో యాక్షన్ తో జత చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు,  ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన రాజా ది గ్రేట్ తో అనిల్ రావిపూడి హైడ్రిక్ విజయాలను అందుకున్నాడు.  ఆ తర్వాత వెంకటేశ్ , వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2 అనే మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించి అనిల్ రావిపూడి మంచి విజయాన్ని అందుకున్నాడు,  ఎఫ్ 2 సినిమా తర్వాత అనిల్ రావిపూడి , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమా ను తెరకెక్కించాడు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.


  ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 మూవీ కి ప్రాంచేజి గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు,  ఎఫ్ 3 మూవీ  పూర్తి కాగానే అనిల్ రావిపూడి,  నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు,  ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి బాలకృష్ణ తో సినిమాను పూర్తి చేసిన తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది, ఇలా  అనిల్ రావిపూడి ఒక సినిమా సెట్స్ పై ఉండగానే ఆ తర్వాత రెండు మూవీల లైనప్ ను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: