త్రిబుల్ ఆర్ సీక్వల్.. క్లారిటీ వచ్చేసిందిగా?
అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీసారూ. ఈ సినిమా సీక్వల్ అంతకుమించిన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వల్ ఉండబోతుందా అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అయితే గతంలో రాజమౌళిని ప్రమోషన్ సమయంలో సీక్వెల్ గురించి ప్రశ్నించగా సీక్వెల్ గురించి ఇప్పటివరకు ఆలోచన చేయలేదు అంటూ చెప్పారు రాజమౌళి.
దీంతో త్రిబుల్ ఆర్ కు సిక్వల్ ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతున్న సమయంలో ఇటీవలే ఒక క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమా సీక్వెల్ పై రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఓ రోజు ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చి సీక్వెల్ గురించి అడిగాడు. ఇక అదే సమయంలో కొన్ని ఐడియాలను ఎన్టీఆర్ తో షేర్ చేసుకున్నాను. ఆ ఐడియాలు ఎన్టీఆర్ రాజమౌళికి బాగా నచ్చాయి. ఒకవేళ దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో త్రిబుల్ ఆర్ సినిమా కి సీక్వల్ రావచ్చు అంటూ విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమాకు ఇంకా స్క్రిప్ట్ సిద్ధం చేయలేదని అదే పనిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు..