
అనుష్క మూవీ అప్ డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటినుంచి అంటే?
అయినప్పటికీ భాగమతి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తెరమీదికి వచ్చింది. మరోసారి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వైవిధ్యమైన సినిమాలు మాత్రమే చేస్తూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ అనుష్క శెట్టి యువ హీరో నవీన్ పొలిశెట్టి ఒక సినిమా రాబోతుంది అని గత కొన్ని రోజుల క్రితం టాక్ అనిపించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా బయటకి రాలేదు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ అసలు ఉంటుందా లేదా అన్నది ప్రేక్షకులందరిలో నెలకొన్న ప్రశ్న. ఇలాంటి సమయంలోనే అనుష్క మూవీకి సంబంధించి ఒక వార్త అభిమానులందరినీ కూడా ఆనంద పరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
యువ హీరో నవీన్ పోలిశెట్టి హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్లో శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా త్వరలో ప్రారంభం కాబోతుందట. ఈనెల 4వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది అని చిత్రబృందం తెలిపింది. మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. యు.వి.క్రియేషన్స్ ఇక ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. ఇక ఇందులో అనుష్క ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త లుక్ లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు అనేది తెలుస్తుంది. అయితే ఈ సినిమాను తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.