అందాల ముద్దుగుమ్మ
రష్మిక మందన
కిరిక్ పార్టీ అనే
కన్నడ సినిమా ద్వారా
కన్నడ ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకుంది, కిరిక్ పార్టీ సినిమాతో
కన్నడ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత
టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా
ఛలో మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఛలో
సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రష్మీక మందన కు మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది, ఆ తర్వాత రష్మీక మందన
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
రష్మిక మందన
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్
హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది, ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదలైన పుష్ప
సినిమా ద్వారా
రష్మిక మందన పాన్
ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది, ఈ
సినిమా తర్వాత విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో
రష్మిక మందన
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మీక మందన ఎక్కువగా
బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఫోకస్ పెట్టింది, అందులో భాగంగా
రష్మిక మందన ఇప్పటికే పలు
బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అందులో భాగంగా
రష్మిక మందన, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధానపాత్రలో తెరకెక్కిన మిషన్ మజ్ను సినిమాలో
హీరోయిన్ గా నటించింది, మరి కొన్ని రోజుల్లో ఈ
మూవీ విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మరో క్రేజీ
బాలీవుడ్ సినిమాలో
రష్మిక మందన అవకాశాన్ని దక్కించుకుంది, సందీప్
రెడ్డి వంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా ఎనిమాల్
సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమాలో
హీరోయిన్ గా
రష్మిక మందన నటించబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు
సందీప్ రెడ్డి వంగా, రష్మిక మందన 'ఎనిమల్' సినిమాలో నటించబోతున్న విషయాన్ని అధికారికంగా సోషల్
మీడియా ద్వారా తెలియజేశాడు, సందీప్
రెడ్డి వంగ సోషల్
మీడియా ద్వారా
రష్మిక మందన 'ఎనిమల్' సినిమాలో
గీతాంజలి పాత్రలో కనిపించబోతుంది అని అధికారికంగా తెలియజేశాడు.