ఇది ఇలా ఉంటే
సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్
హీరోయిన్ గా కొనసాగుతున్న సమయం లోనే అక్కినేని
నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడిన విషయం మనందరికీ తెలిసిందే, గత కొంత కాలం క్రితమే వీరిద్దరూ విడిపోయారు. ఇలా
సమంత , నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత తన సినిమాల స్పీడ్ ను పెంచింది, అందులో భాగంగా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగులో శాకుంతలం సినిమాను పూర్తి చేసిన
సమంత ప్రస్తుతం యశోద
సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉంది , ఇది ఇలా ఉంటే
సమంత ఇప్పటికే ఒక
హాలీవుడ్ సినిమాలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇది ఇలా ఉంటే
సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది. అలాగే ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా
బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న
సమంత వరుస పెట్టి అనేక
బాలీవుడ్ అవకాశాలను కూడా దక్కించుకున్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం
సమంత మరో క్రేజీ
బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోయే సినిమాలో
సమంత నటించబోతున్నట్లు తెలుస్తుంది.