లైగర్ : డబ్బింగ్ తో ఆదరగొట్టేసిన మైక్ టైసన్!

frame లైగర్ : డబ్బింగ్ తో ఆదరగొట్టేసిన మైక్ టైసన్!

Purushottham Vinay
కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న" లైగర్ "మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటోంది. సినిమా కథ విషయానికి వస్తే..ముంబై స్లమ్ ఏరియాలో వుండే ఛాయ్ వాలా కిక్ బాక్సింగ్ లో ఎలా ఛాపియన్ గా మారాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటీ? అనే ఇంట్రెస్టింగ్ కథ కథనాలతో ఈ మూవీని దర్శకుడు పూరి జగన్నాథ్ తనదైన స్టైల్ లో తెరకెక్కించారు. ఇటీవల గ్లింప్స్ ఆఫ్ `లైగర్` పేరుతో విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాల్ని బాగా పెంచేసింది.ఇందులో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ ఓ ముఖ్య అతిథి పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ ఇంకా మైక్ టైసన్ లు పాల్గొనగా కీలక ఘట్టాన్ని యుఎస్ లో పూరి జగన్నాథ్ షూట్ చేశారట. ఇక ఈ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.ఈ సినిమా పూర్తయి పోయి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కి చేరడంతో తన పాత్రకు మైక్ టైసన్ తానే సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.



శుక్రవారం నాడు ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.అంతే కాకుండా తగ్గేదే లే అంటూ మైక్ టైసన్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలని కూడా షేర్ చేసింది. డబ్బింగ్ తరువాత మైక్ టైసన్ ఈ మూవీలో మీ టీమ్ తో కలిసి పనిచేసినందుకు చాలా గ్రేట్ గా ఫీలవుతున్నానని తనని చాలా బాగా చూసుకున్నారని టీమ్ ని పొగడటం విశేషం. సినిమాలో విజయ్ దేవరకొండ మైక్ టైసన్ మధ్య వచ్చే సీన్లు ఫ్యాన్స్ కి ఓ ట్రీట్ లా వుంటాయని సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ కోసం వరల్డ్ వైడ్ గా వున్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఈ మూవీని ఆగస్టు 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: