చిత్రపురిలో విషాదం: బాలయ్య డైరెక్టర్ మృతి !

VAMSI
గత సంవత్సరం కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో వరుస మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మహా మహులను కోల్పోయి టాలీవుడ్ మూగబోయింది. ఇప్పుడు మళ్లీ మరో విషాద వార్తతో అందరూ శోక సంద్రములో మునిగి పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ శుక్రవారం తుదిశ్వాస వదిలారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు తన కుటుంబ సభ్యులు తెలియ జేశారు. అయితే ఆయన అంత్య క్రియలు రేపు మహా ప్రస్థానంలో జరగనున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

శరత్ తెలుగులో ఇంచు మించుగా 20 సినిమాలకు ద‌ర్శక‌త్వం చేశారు. అంతే కాకుండా ‘డియర్’ అనే న‌వ‌లను ఆధారంగా చేసుకుని ‘చాద‌స్తపు మొగుడు’ అనే సినిమా చేయటంతో శరత్ సినిమా ఇండస్ట్రీకి సుపరిచితుడు అయ్యారు. అలాగే హీరో బాల‌కృష్ణ సుమ‌న్‌ లను హీరోలుగా చూపి సినిమాలను తెరకెక్కించి తిరుగులేని విజ‌యాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇంకా అక్కినేని నాగేశ్వర్ రావుతో ‘కాలేజీ బుల్లోడు’, అలాగే జ‌గ‌ప‌తిబాబుతో ‘భ‌లే బుల్లోడు’,  ఇంకా ఎక్కువగా బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్ మరియు సుమన్‌తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ బావ మరిది, చిన్నల్లుడు వంటి సినిమాలకు దర్శకత్వం చేశారు శరత్. అయితే ప్రముఖ దర్శకుడు శరత్ ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోలేదట.

ఈయన ఎక్కువగా బాలకృష్ణ తో సినిమాలను చేశాడు. అయితే ఈ మరణ వార్త తెలిసిన బాలకృష్ణ తీవ్ర దుఃఖానికి లోనయి ఉంటారు. మన తెలుగు ఇండ్ట్రీకి ఇన్నీ ఘన విజయాలను అందించిన దర్శకుడు శరత్ మరణ వార్తతో తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు ఆయన ఆత్మ కు శాంతి చేసుకురాలంటూ నివాళులు తెలియ శారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: