అంతు చిక్కని వంశీ పైడిపల్లి వ్యూహాలు !

Seetha Sailaja

దర్శకుడు వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తీసి మూడు సంవత్సరాలు దాటిపోయింది. ఆసినిమా సక్సస్ అయినప్పటికీ ఈ దర్శకుడుకి టాప్ హీరోల సినిమాలలో అవకాశాలు రాలేదు. మహేష్ తో తనకున్న సాన్నిహిత్యంతో మరొక సినిమా తీయాలని ప్రయత్నించినా మహేష్ నుండి పెద్దగా స్పందన రాలేదు అని అంటారు.


లేటెస్ట్ గా ఈ దర్శకుడు తమిళ టాప్ హీరో విజయ్ తో ఒక సినిమాను తీయవలసి ఉంది దిల్ రాజ్ నిర్మాణంలో నిర్మించబడే ఈసినిమా విజయ్ లేటెస్ట్ మూవీ ‘బీష్ట్’ తరువాత ప్రారంభం కావలసి ఉంది. అయితే ఆమూవీ షూటింగ్ ప్రారంభం కాకుండానే ఇప్పుడు వంశీ పైడిపల్లి ఛార్మీ పూరీ  జగన్నాథ్ లతో కలిసి ఒక మూవీ ప్రాజెక్ట్ లో ఇన్వాలవ్ అవ్వడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.


పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’ ను విజయ్ దేవరకొండతో తీస్తున్నాడు. లేటెస్ట్ గా ఈసినిమాకు సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ లో వంశీ పైడిపల్లి పూరీ జగన్నాథ్ ఛార్మీ విజయ్ దేవరకొండ లతో కలిసి కనిపించడం మీడియా వర్గాలకు కూడ షాక్ ఇచ్చింది. దీనితో ఈమూవీ ప్రాజెక్ట్ లో వంశీ పైడిపల్లి పాత్ర ఏమిటి అంటూ చర్చలు మొదలయ్యాయి.


ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నది పూరీ కావడంతో అతడి దగ్గర సహాయకుడుగా పనిచేయవలసిన అవసరం వంశీకి లేదు. ఈసినిమాకు సంబంధించి స్క్రిప్ట్ విషయంలో పూరీకి వంశీ సహకరిస్తున్నాడు అని అనుకుంటే వంశీ రచయిత కాదు. దీనితో ఛార్మీ తో కలిసి వంశీ ఈమూవీని నిర్మిస్తున్నాడా అన్న సందేహాలు కొందరికీ వస్తున్నాయి. అయితే ఇలాంటి భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ ను నిర్మించే ఆశక్తి వంశీకి ఉందా అను మరికొందరు షాక్ అవుతున్నారు.  ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది కాబట్టి వంశీ పైడిపల్లి దిల్ రాజ్ విజయ్ ల మూవీ క్యాన్సిల్ అయిందా లేక వాయిదా పడిందా లేకుంటే హీరో విజయ్ కు కథ నచ్చలేదా అన్న సందేహాలు కొందరికి కల్గుతున్నాయి..





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: