రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాప్సి కొత్త సినిమా..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ తాప్సీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది,  ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పడుతుంది.  టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు  వేసింది,  అందులో భాగంగా బాలీవుడ్ లో  సొట్టబుగ్గల సుందరి తాప్సీ నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది,  ఇది ఇలా ఉంటే తాజాగా తాప్సి నటించిన మిషన్ ఇంపాజిబుల్ మూవీ రేపు అనగా ఏప్రిల్ ఒకటో తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.
 


 ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ తో దర్శకుడిగా మంచి పేరు ను సంపాదించుకున్న  స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వం వహించాడు,  ఏప్రిల్ ఒకటవ తేదీన ఈ సినిమా విడుదల కానున్న  కారణంగా నిన్న అనగా మార్చి 30 వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్  ను చిత్ర బృందం నిర్వహించింది, ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు  మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశాడు.  తాప్సి చాలా రోజుల తర్వాత నేరుగా నటిస్తున్న తెలుగు సినిమా కావడంతో మిషన్ ఇంపాజిబుల్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి,  మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఏప్రిల్ ఒకటో తేదీ వరకు వేచి చూడాల్సిందే, ఈ మూవీ ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరో కంటెంట్-రిచ్ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: