యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే , ఈ మధ్యనే ఈ సినిమా థియేటర్ లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల కలెక్షన్ ల సునామీ ని సృష్టిస్తూ కొత్త రికార్డ్ లను సృష్టిస్తూ దూసుకెళ్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు, ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.
ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా సంవత్సరాలు కేటాయించాడు, ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ కి సంబంధించిన పనులు అన్ని ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది, ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటించబోతోంది అంటూ కూడా ఒక వార్త తెగ వైరల్ అవుతుంది .