జాన్ అబ్రహం : తెలుగు చిత్రాలలో అస్సలు నటించను...!!

murali krishna
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం 'ఎటాక్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కిన ఈ సినిమాను లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడట.

జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్ సింగ్‌, ప్రకాష్‌ రాజ్‌, రత్న పాఠక్‌ షా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1 న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం ప్రెస్ మీట్లతో బాగా బిజీగా మారిపోయారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్ అబ్రహం సౌత్ ఇండస్ట్రీ పై సంచలన కామెంట్స్ చేసాడు.. హార్డ్ కోర్ సౌత్ ఫ్యాన్స్ కి కాస్త కోపం తెప్పించేలా.. తెలుగు సినిమాపై జాన్ అబ్రహం కాస్త రూడ్ గా మాట్లాడాడని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రభాస్ చేస్తున్న సలార్‌ మూవీలో ఆయన నటిస్తున్నట్టు వస్తున్న రూమర్లకి జాన్ అబ్రహం క్లారిటీ కూడా ఇచ్చాడు. 'నేను ఎలాంటి తెలుగు సినిమా చేయడం లేదు. నేను ఎప్పటికీ కూడా ప్రాంతీయ సినిమాలు చేయను. నేను ఓ హిందీ హీరోని. ఎన్నడు ఇతర భాషల్లో సెకండ్‌ హీరో, సహానటుడి పాత్రలు అస్సలు చేయను. ఇతర నటుల మాదిగా డబ్బు కోసం తెలుగు లేదా మరే ఇతర ప్రాంతీయ సినిమాల్లో నటింబోయే ప్రసక్తే లేదు' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కాగా ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం సలార్‌లో జాన్‌ అబ్రహం ఓ ముఖ్యమైన రోల్‌ పోషించబోతున్నట్లు గతంలో జోరుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఆ రూమర్ గురించి చెప్పాలి అనుకుంటే.. నటిస్తున్నాను, లేదంటే లేదు అని చెప్పాలి కానీ.. నేను హిందీ నటుడిని.. తెలుగు సినిమాలు చేయను అని.. టాలీవుడ్ ని తక్కువ చేసి మాట్లాడటం అవసరమా అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్సే తెలుగు సినిమాకి సలామ్ కొడుతుంటే.. మాములు హీరోకి ఇంత ఓవర్ యాక్షన్ ఏంటో అని ఆయనపై తెగ విమర్శలు వస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: