టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ హీరో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి రాజావారు రాణిగారు మూవీ తో ఎంట్రీ ఇచ్చాడు, ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించింది, ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా కిరణ్ అబ్బవరం కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తీసుకు వచ్చింది. ఇలా ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం కొన్ని రోజుల క్రితమే సబాస్టియన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు, కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే మూవీ లో నటిస్తున్నాడు, ఈ మూవీ కి కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో కార్తిక్ శంకర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ను చిత్ర బృందం బయటకు వదిలింది, ఈ సినిమా నుండి 'లాయర్ పాప' అనే ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 2 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది, ఈ మూవీ కి మణిశర్మ సంగీతం సమకూర్చాడు.