యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ మధ్యనే మార్చి 25 వ తేదీన థియేటర్ లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకొని ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను కొల్లగొడుతూ ముందుకు దూసుకుపోతుంది, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయాన్ని కేటాయించారు, 2018 లో విడుదలైన అరవింద సమేత సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా పనులన్నీ ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది, జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, కెరియర్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఇది 30 వ సినిమా.
ఇది వరకే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది, ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమా పనులు కూడా దాదాపుగా ముగిశాయి, ఈ సినిమాను ఏప్రిల్ 29 వ తేదీన విడుదల కాబోతుంది. ఇలా వీరిద్దరి సినిమా పనులు దాదాపుగా ముగియడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది, తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ షూటింగ్ ను జూన్ మొదటి వారంలో మొదలు పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.