చిరంజీవి పాదాలను పట్టుకోవాలని ఆశిస్తున్న నటుడు !

Seetha Sailaja

‘ఛత్రపతి’ మూవీలో నటించిన శేఖర్ కు ఆమూవీ తరువాత ‘ఛత్రపతి’ శేఖర్ గా గుర్తింపు పొందాడు. మంచి నటుడుగా అతడికి గుర్తింపు వచ్చినప్పటికీ సినిమాలలో అవకాశాలు మాత్రం అతడికి అంతంతమాత్రంగానే వస్తున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో కీలక పాత్ర అయిన మల్లికకు ఇతడు తండ్రిగా నటించాడు.


రాజమౌళి చేతిలోపడితే ఏనటుడుకు అయినా వెంటనే గుర్తుకు వస్తుంది. అతడు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో నటించింది కేవలం కొద్ది నిముషాలు మాత్రమే అయినా ఆ పాత్రలో అతడు ఒదిగిపోయి నటించాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు శేఖర్ రాజమౌళితో తనకు గల సాన్నిహిత్యం గురించి వివరిస్తూ అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. రాజమౌళిని అవకాశాలు అడిగితే ఇవ్వరని ఆయనకు ఎప్పుడు అవకాశం ఇవాలి అని అనిపిస్తే అప్పుడు మాత్రమే అవకాశాలు ఇస్తారు అంటూ అందువల్ల తాను ఎప్పుడు జక్కనను తన సినిమాలో అవకాశం ఇమ్మని అడగలేదు అని చెప్పాడు.


అంతేకాదు తాను రాజమౌళికి ఎప్పుడు ఫోన్ చేయడం కానీ కనీసం మెసేజ్ పెట్టడం కూడ చేయనని తాను తీసే సినిమాలలో ఒక నటుడుకి సరిపోయే పాత్ర ఉన్నప్పుడు అది ఎవరికైనా అడగకుండానే వస్తుంది అంటూ జక్కన్న మనస్తత్వాన్ని వివరించాడు. తాను నటించే పాత్రకు సంబంధించిన ఒక సీన్ లో తాను చెట్టు ఎక్కవలసి వచ్చిందని అలా ఎక్కడంలో తాను ఎక్కడ పడిపోతానో అన్న ఆతృతతో రాజమౌళి ఎన్నిజాగ్రత్తలు తీసుకోవాలో అన్నిజాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని వివరించాడు.


ఇక మెగా స్టార్ చిరంజీవి పట్లఉన్న అభిమానాన్ని వివరిస్తూ తాను చిరంజీవితో కలిసి నటించాలి అన్నది తన కోరిక అంటూ అవకాశం వస్తే చిరంజీవి పక్కన్న నిలబడటమే కాకుండా ఆయన కాళ్ళు పట్టుకోవాలని తన కోరిక అంటూ మెగా స్టార్ ను ప్రశంసలతో ముంచెత్తివేసాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో తాను చరణ్ తో కలిసి నటించిన సందర్భంలో కూడ తాను ఎప్పుడు చిరంజీవిని కలవాలన్న కోరిక వ్యక్త పరచలేదనీ ఆయనను అడిగి అలా కలవడం ఇష్టంలేదు అని అంటున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: