అల్లు అర్జున్, ధనుష్.. ఓ క్రేజీ మల్టీస్టారర్?
ఇప్పటికీ వరుసగా రికార్డులు సాధిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. ఇక త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి సౌత్ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారు నటించారు. ఈ ఇద్దరు హీరోలు ఉన్న విపరీతమైన క్రేజ్ ఈ సినిమా విజయానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇలా మల్టీస్టారర్ హవా నడుస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు సరికొత్త మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో కి వచ్చేసింది. ఇక ఇప్పుడు మరో క్రేజీ కాంబో కి అంత సిద్ధమైపోయింది అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోలుగా ఒక మల్టీస్టారర్ రాబోతుందట.
అంతేకాదండోయ్ టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న కొరటాల శివ ఇక ఈ క్రేజీ మల్టీస్టారర్ కు దర్శకత్వం వహించబోతున్నాడు అన్నది ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక ఇది నిజమైతే బాగుండు అని అటు ధనుష్ ఇటు అల్లు అర్జున్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 తో ధనుష్ సార్ సినిమాతో కొరటాల శివ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే బన్నీ ధనుష్ కాంబో మల్టీస్టారర్ పై దృష్టి పెడతాడట దర్శకుడు కొరటాల శివ. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..