ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన... రణ్వీర్ సింగ్..!

Pulgam Srinivas
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవ్ గన్ , శ్రీయ , సముద్ర కని ప్రధాన పాత్రల్లో డి.వి.వి.దానయ్య నిర్మాణం లో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్.  ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మార్చి 25 వ తేదీ న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది, విడుదలయిన మొదటి షో నుండే ఆర్ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్ లను  సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్ లను నమోదు చేస్తూ  దూసుకుపోతుంది. ఇలా బాక్స్ ఆఫీస్  దగ్గర కొత్త రికార్డ్ లను నమోదు చేస్తున్న  ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు,   బాలీవుడ్ స్టార్ హీరో  రన్బీర్ సింగ్ తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ పై ప్రశంసల వర్షం కురిపించాడు.  


తాజాగా  బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్  ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ...  రీసెంట్‌ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ హాలీవుడ్ మూవీ లను కూడా బాక్స్ ఆఫీస్  వద్ద బీట్ చేసేసి దూసుకెళ్తుంది , నిజం గా ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది అని రణ్వీర్ సింగ్ తాజా  ఇంటర్వ్యూ లో భాగంగా అన్నాడు.  అంతే కాదు రణ్వీర్ సింగ్ ఈ సందర్భం గా తెలుగు లో నాటు నాటు సాంగ్ పాడి ఆశ్చర్యపరిచాడు,  ఫైనల్‌ గా రాజమౌళి ఇలాంటి గ్రేట్ మూవీస్ తో ఇండియన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చెయ్యడం చాలా సంతోషంగా ఉంది.. అని  ఆర్ఆర్ఆర్ మూవీ పై రణ్వీర్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: