విజయ్ దేవర కొండ పై అభిమానులలో అసంతృప్తి !
ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘లైగర్’ మూవీ కరోనా పరిస్థితులు కారణంగా ఈసినిమా విడుదల ఆలస్యం అవుతోంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ ఆగష్టులో విడుదల కావలసి ఉంది. అయితే అప్పటికి దేశంలో మళ్ళీ కరోనా ఫోర్త్ వేవ్ వస్తే మళ్ళీ విజయ్ దేవరకొండ సినిమాలకు కష్టాలు తప్పవు. ఈమూవీ తరువాత విజయ్ సుకుమార్ కొరటాల శివాల దర్శకత్వంలో సినిమాలు చేయవలసి ఉంది.
అయితే ప్రస్తుతం వారిద్దరూ అల్లు అర్జున్ జూనియర్ లతో కనెక్ట్ అయి ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు వీరిద్దరూ ఖాళీగా ఉండరు. దీనితో ‘లైగర్’ తరువాత మళ్ళీ విజయ్ స్పీడ్ కు బ్రేక్ పడే ఆస్కారం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో సమయం వృధా చేసుకోవడం ఇష్టం లేక ఈయౌబ్గ్ హీరో శివ నిర్వాణ తో ఒక మూవీకి అంగీకరించాడు. శివ నిర్వాణ మంచి సినిమాలు తీస్తాడు బ్లాక్ బష్టర్ హిట్స్ ఇవ్వలేడు.
దీనితో మళ్ళీ విజయ్ దేవరకొండకు బ్లాక్ బష్టర్ హిట్ పడేది ఎప్పుడు ఆభిమానులు తెగ తెసిఒన్ పడుతున్నారు. ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ ‘లైగర్’ లో నటిస్తున్నప్పటికీ ఆసినిమా బ్లాక్ బష్టర్ హిట్ పై కొన్ని సందేహాలు ఉన్నాయి. బాక్సింగ్ నేపధ్యంలో ఇప్పటికే అనేక హిట్స్ సినిమాలు తెలుగులో వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి బాక్సింగ్ కథను విజయ్ ఎంచుకోవడం ఇకవిధంగా ప్రయోగం అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈవిషయాలు అన్నీ అభిమానుల దృష్టి వరకు రావడంతో విజయ్ కు ఎప్పుడు బ్లాక్ బష్టర్ హిట్ వస్తుందా అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు..