జానీ మాస్టర్ కు ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చిన విజయ్..!
ఈయన ఇప్పటివరకు కంపొజ్ చేసిన పాటలు అన్నీ కూడా భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి. దాంతో మాస్టర్ బాగా బిజీ అయ్యారు. లెక్క లెనన్ని సినిమాల తో బిజిగా ఉన్నారు. తెలుగు, తమిళ్, మలయాళం లో ఎన్నో సినిమాలను చేసి మంచి క్రేజ్ ను అందుకున్నారు.. జానీ మాస్టర్ చేసిన పాటలు హిట్ అవ్వడం తో కన్నడ స్టార్ హీరో సుధీప్ కుమార్ జానీ మాస్టర్ కు భారీ ఖరీదు కలిగిన కారును గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి గురించి టాక్ ఫిలిం ఇండస్ట్రీ లో చక్కర్లు కోడుతుంది..
ఇప్పుడు మరో హీరో కూడా జానీ మాస్టర్ కు ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చాడు.. జానీ మాస్టర్ కంపొజ్ చేసిన సాంగ్ సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపెస్తుంది. సామన్యుల నుంచి స్టార్ హీరోల, సెలెబ్రిటీల వరకూ ఆ సాంగ్ కు స్టెప్పులు వేశారు. మొత్తానికి ప్రస్తుతం ఆ పాట ట్రెండ్ లో ఉండటంతో మాస్టర్ ను అభినందించారు.ఆ హీరోనే దళపతి విజయ్.. ఈయన ప్రస్తుతం 'బీస్ట్' సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాను తెలుగు,మలయాళ, కన్నడ ,హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను అందుకున్న సాంగ్ హలమితి హబిబో` సాంగ్ ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఈ సాంగ్‌ను ఇమిటెడ్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు.. ఆ సాంగ్ ను జానీ మాస్టర్ కంపొజ్ చేశారు. అది హిట్ అవ్వడంతో మాస్టర్ కు గోల్డ్ చెయిన్ ను విజయ్ గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి... ఈ సినిమా ముందుగా ఏప్రిల్ 13వ తేదీన విడుదల చెయనున్నారు.