కాస్త కష్టంగా ఉన్నా.. అది నాకు ఇష్టమే : రాశి ఖన్నా
ఇక ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న యోధా సినిమా షూటింగ్లో పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తూ ఉన్నాడు. ఇక దర్శకద్వయం సాగర్, పుష్కర్ ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండటం గమనార్హం. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రాశిఖన్నా తో పాటు అటు దిశాపటాని కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇక స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమాల నిర్మిస్తూ ఉండడం గమనార్హం. నవంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ విశేషాలను అభిమానులతో పంచుకుంది రాశిఖన్నా. యోధ అనే సినిమా షూటింగులో పాల్గొనడానికి ముందు తమిళ చిత్రం సర్దార్ షూటింగ్ తో ఎంతో బిజీగా మారిపోయింది. ఈ సినిమా కార్తీ హీరో గా తెరకెక్కుతోంది.
సర్దార్ సినిమాకు సంబంధించిన నైట్ షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఢిల్లీలో జరుగుతున్న యోధ డే షూట్ లో జాయిన్ అయ్యాను. సరిగ్గా నిద్ర పోయే అంత సమయం కూడా ఉండటం లేదు. అయితే ఆర్టిస్టుగా లైఫ్ కాస్త కష్టంగా అనిపించినప్పటికీ నాకు ఇదంతా ఇష్టం గానే ఉంది అంటూ రాశిఖన్నా చెప్పుకొచ్చింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన థాంక్యూ సినిమాలో రాశి ఖన్నా నటించింది. ఇక ఈ సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి..