త్రిబుల్ ఆర్ సినిమా పై స్పందించిన బన్నీ.. ఏమన్నాడో తెలుసా?

praveen
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా త్రిబుల్ ఆర్ మేంమేనియా నడుస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా 500 కోట్ల బడ్జెట్తో ఇద్దరు సూపర్ హీరో లతో తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి రోజు నుంచే త్రిబుల్ ఆర్ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం త్రిబుల్ ఆర్ దూసుకుపోతున్న తీరు చూస్తుంటే అటు బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని తెలుస్తోంది. అయితే ఇక త్రిబుల్ ఆర్ కోసం కేవలం సినీ ప్రేక్షకులు అభిమానులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూసారు అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే నిన్న త్రిబుల్ ఆర్ సినిమా విడుదల అయిందో లేదో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఇక ఈ సినిమా చూసి ఇక తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. సినిమా అదిరిపోయింది ఇక ఇలాంటి సినిమాలు తీయడం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుందని.. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కాదు కేవలం వారి పాత్రలు మాత్రమే కనిపించాయని  ఎన్నో ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పై స్పందించాడు. ఇటీవల ట్విట్టర్ వేదికగా సినిమా పై ప్రశంసల వర్షం కురిపించాడు అల్లు అర్జున్.

 చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నాను.. త్రిబుల్ ఆర్ ఎంతో అద్భుతమైన మూవీ.. ముఖ్యంగా తెలుగు సినిమా గౌరవం అయినా దర్శకుడు రాజమౌళి విజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక సోదర సమానుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాలో కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అద్భుతంగా ఉంది. ఇక నా బావ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా లో పవర్ హౌస్ లా కనిపించాడు అంటూ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ త్రిబుల్ ఆర్ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతకుముందు ఇక బన్నీ దర్శకుడు సుకుమార్ ఇలాంటి సినిమాలను మీరు తీయగలరు మేము చూడగలం ఇలాంటి అద్భుతాలు మీకే సాధ్యమవుతాయి అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr

సంబంధిత వార్తలు: