తెలుగుతో పాటు హిందీ తమిళ్ లో రాబోతున్న హృదయం సినిమా..!

Pulgam Srinivas
ఏదైనా ఒక సినిమా ఒక భాషలో విడుదలై ఆ సినిమా మంచి విజయం సాధించినట్లు అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో విడుదల చేయడానికి ఎంతో మంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు,  ఇప్పటి వరకు అలా ఒక భాషలో మంచి విజయాన్ని సాధించిన సినిమా లను ఇతర భాషలలో విడుదల చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి, అలా అలా ఒక భాషలో మంచి విజయాలు సాధించిన సినిమాలను ఇతర భాషల్లో విడుదల చేసిన సందర్భాలలో పరాజయం పాలు అయిన సినిమాలు ఉన్నాయి,  అలాగే సూపర్ హిట్ సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి,  అలాగే ప్రస్తుతం ఒక భాష లో విడుదలై ప్రేక్షకుల నుండి ఆదరణను సంపాదించుకున్న సినిమాను ఇతర భాషల్లో విడుదల చేయడానికి ఓ ప్రముఖ నిర్మాత ముందుకు వచ్చాడు.


ఈ సంవత్సరం మలయాళం లో విడుదల అయిన హృదయం సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే, మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌, కళ్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఒక్క మయాళ ప్రేక్షకులనే కాకుండా భాష కు అతీతంగా అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకుంది,  ఒక కుర్రాడి జీవితం లో వివిధ దశల్లో జరిగే ప్రయాణాన్ని ఈ మూవీ లో దర్శకుడు అద్భుతంగా చూపించాడు.  హీరో ,  హీరోయిన్ ల నటన ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది,  అలాగే ఈ సినిమా సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర ను పోషించింది.  ఇది ఇలా ఉంటే నిర్మాత  కరణ్‌ జోహార్‌ ఈ సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు,  హిందీ , తెలుగు ,  తమిళ భాషలలో ఈ సినిమాను రీమేక్ చేయనున్నారు,  ఈ విషయాన్ని కరణ్‌ జోహార్‌ అధికారికంగా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: