"ఆర్ ఆర్ ఆర్": సెకండ్ హాఫ్... సో సో గా ఉంది?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు బడా స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించడం అంటే మామూలు విషయమా..! అందులోనూ రాజమౌళి వంటి ప్రతిష్టాత్మక దర్శకత్వంలో అంటే అది వేరే లెవల్ అంతే. ఊహకందని అంచనాలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన పాన్ ఇండియా మూవీ rrr అందరినీ ఆకట్టుకుంటోంది. స్వాతంత్య్రం రాకముందు జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అన్న టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా చెర్రీ, తారక్ ల నటన ప్రేక్షకులను మెప్పిస్తోంది. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని అంటున్నారు.
ఫస్ట్ హాఫ్ మొత్తం హైలెట్ అనేలా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం కాస్త అసంతృప్తిని మిగిల్చింది అనే చెప్పాలి. మొదటి అర్ద భాగం మాత్రం మంచి ఫ్లో లో ఉంటే, సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడా నెమ్మదించింది. రాజమౌళి సినిమాల్లో ఎమోషనల్ కంటెంట్ ఎంత బాగా పండుతుందో తెలిసిందే. అలాంటిది ఈ సినిమాలో అదే నెగిటివ్ గా అనిపించింది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల పాత్రల విషయానికి వస్తే. తారక్ పాత్ర కంటే రామ్ చరణ్ పాత్ర చాలా హైలెట్ గా చూపించారు జక్కన్న. అయితే ఏ సినిమాకు అయినా ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ బాగుండేలా ప్లాన్ చేసుకుంటారు. మరి జక్కన్న ఇక్కడ ఎందుకు రాంగ్ స్టెప్ వేశారో అర్ధం కావడం లేదు.