నయన గురించి షాకింగ్ న్యూస్..!

NAGARJUNA NAKKA
నయనతార, విఘ్నేష్ శివన్‌ పెళ్లి గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రైవేట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట పెళ్లి కూడా రహస్యంగా చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల నయన్‌ కాళికాంబ టెంపుల్‌లో పాపిట్లో సింధూరంతో కనిపించింది. దీంతో నయన్, విఘ్నేష్‌ పెళ్లి అయిపోయిందని వార్తలు మొదలయ్యాయి. అంతేకాదు నయనతార త్వరలోనే తల్లికాబోతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. సరోగసీ పద్దతిలో నయనతార, విఘ్నేష్‌ శివన్‌ తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి వార్తలపై మౌనంగా ఉన్నట్టే, తల్లికాబోతోందనే ప్రచారంపైనా పెదవి విప్పలేదు ఈ లవ్‌ బర్డ్స్.
యాక్టర్ కమ్ యాంకర్ కమ్ ప్రొడ్యూసర్‌గా మల్టీటాలెంట్స్‌ చూపించిన మంచు లక్ష్మి సరోగసీ పద్దతిలో అమ్మ అయ్యింది. మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాస్ దంపతులు సరోగసీ విధానంలో అమ్మానాన్నలు అయ్యారు. 2014లో విద్యా నిర్వాణ మంచు ఆనంద్‌కి సరోగసీలో జన్మనిచ్చారు లక్ష్మీశ్రీనివాస్. సరోగసీ మదర్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన 'మిమి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. గర్భం దాలిస్తే ఫిగర్‌లో మార్పు వస్తుందా, హీరోయిన్ కటౌట్‌లో చేంజ్‌ వస్తుందా అనే అడుగుతుంది హీరోయిన్. బాలీవుడ్‌ స్టార్స్‌లో చాలామంది ఈ ఫిగర్‌ లెక్కలతోనే సరోగసికి వెళ్తున్నారని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌ బ్యూటీస్‌ మాత్రం మెడికల్‌ రీజన్స్‌తోనే సరోగసీకి వెళ్తున్నామని అంటున్నారు.
ప్రియాంక చోప్రా ఎప్పుడు లూస్‌గా ఉన్న డ్రెస్‌ వేసుకున్నా ప్రెగ్నెంట్‌ అనే కామెంట్స్‌ వినిపించేవి. నిక్‌ జోనస్‌ అకౌంట్‌కి కంగ్రాట్స్‌ మెసేజులు వెళ్లేవి. అయితే ప్రియాంక మాత్రం పిల్లలు గురించి ఇంకా ఆలోచించలేదని చెప్తుండేది. దీంతో వీళ్లిద్దరు పేరెంటింగ్‌కి ఇంకా ప్రిపేర్‌ కాలేదేమో అని అంతా అనుకున్నారు. అయితే అభిమానులందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సరోగసీ పద్దతిలో అమ్మానాన్నలమయ్యామని పోస్ట్‌ పెట్టారు ప్రియాంక, నిక్.
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కి మొత్తం ముగ్గురు పిల్లలు. ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ పుట్టాక షారుక్, గౌరీ మరో బేబీ కావాలనుకున్నారు. ఏజ్‌ ఫ్యాక్టర్‌తో సహజప్రక్రియని పక్కనపెట్టి టెక్నాలజీని ఆశ్రయించారు. సరోగసీ పద్దతిలో అబ్రమ్‌ ఖాన్‌కి జన్మనిచ్చారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ బుడ్డోడికి పెద్డోడు ఆర్యన్ ఖాన్‌ కంటే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంది. ఐపీయల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్ మ్యాచుల్లో అబ్రమ్‌ ఖాన్ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంటాడు.
ఆమిర్‌ ఖాన్‌ నలభైల్లో ఉన్నప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. 'లగాన్' సినిమాకి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన కిరణ్‌ రావుని పెళ్లి చేసుకున్నాడు. అయితే సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉండే వీళ్లిద్దరు పిల్లల కోసం కెరీర్‌కి బ్రేకులు పడొద్దని సరోగసీని ఆశ్రయించారు. ఈ సరోగసి పద్దతిలో ఆజాద్‌ రావు ఖాన్‌కి అమ్మానాన్నలు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: