ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నివేదా థామస్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ నివేదా థామస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి నాచురల్ స్టార్ నాని హీరో గా తెరకెక్కిన జెంటిల్ మన్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు జెంటిల్ మన్ మూవీ లో నివేద థామస్ నటన తో కూడా ప్రేక్షకులను అలరించడం తో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు కూడా దక్కాయి,  అందులో భాగంగా నివేద థామస్ నటించిన నిన్ను కోరి ,  బ్రోచేవారెవరురా , వకిల్ సబ్ మూవీ లు మంచి విజయాలు సాధించడంతో నివేద థామస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న నివేద థామస్ తమిళ సినిమాల్లో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది,  ఇది ఇలా ఉంటే నివేద థామస్ తాజాగా మీరు 'అడిగితే నేను చెబుతా' అంటూ సోషల్‌ మీడియాలో తనను ఫాలో అవుతున్నవారికి ఓ ఆఫర్‌ ఇచ్చారు, నివేద థామస్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేసింది.

ఈ క్రమంలో నివేదా థామస్ ను ఓ నెటిజన్ ఆర్ఆర్ఆర్ మూవీ చూస్తారా అని ప్రశ్నించగా...  దేనికి నివేదా థామస్ హండ్రెడ్ పర్సెంట్ చూస్తా అంటూ సమాధానమిచ్చింది.

అలాగే ఓ నెటిజన్ నివేదా థామస్ ని మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని ప్రశ్నించగా... దానికి నివేదా థామస్ చల్లని వాతావరణం తో రాత్రి నిశ్శబ్దంగా ఉండాలి,  నక్షత్రాలు ఆకాశం నిండా ఉండాలి, ఇలా ఉండే ఏ ప్లేస్‌ అయినా నాకు ఇష్టమే అని ఈ ముద్దుగుమ్మ సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: