కేజిఎఫ్ చిత్రాన్ని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ విరే..!!

Divya
భారతదేశమంతటా కేజిఎఫ్ చిత్రానికి మంచి భారి స్పందన లభించిందని చెప్పవచ్చు.. ఈ సినిమాలోని కథ, ఎమోషన్స్, చూపించిన వైలెన్స్ ఈ చిత్రాన్ని హైలెట్ గా నిలిచాయి. మరీ ముఖ్యంగా ఇందులో హీరో యశ్ నటన ఎంతో అద్భుతంగా కనపరిచారని చెప్పవచ్చు. ఇందులోని ప్రతి సన్నివేశం కూడా ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. అందుచేతనే కేవలం మొదటి పార్ట్ తోనే ప్రపంచమంతా ఎంతో గుర్తింపు పొందడంతో పాటు పార్ట్-2 కొసం ప్రేక్షకులను ఎదురు చూసేలా చేసింది ఈ చిత్రం. ఇప్పుడు తాజాగా కే జి ఎఫ్ -2 సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేసుకొని త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు.


అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం.. కేజిఎఫ్ చిత్రాన్ని భారతదేశమంతటా డిస్ట్రిబ్యూటర్స్ జాబితా విడుదల కావడం జరిగింది. ఇందులో కర్ణాటక- హొంబలే ఫిల్మ్స్, తెలుగు రాష్ట్రాలలో వారాహి చలనచిత్రం గారు, కేరళలో- పృధ్విరాజ్ ప్రొడక్షన్స్, తమిళనాడులో- డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, నార్త్ ఇండియాలో-ఎక్సెల్ మరియు ఏ ఏ ఫిల్మ్స్ వారు  ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ గా తీసుకున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి అంచనాలను దాటి వేస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

ఇక కే జి ఎఫ్-2 లో పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా నటించడం జరిగింది. తాజాగా విడుదలైన సాంగ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఉన్నది. ఎన్నో రోజులుగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ చిత్రం ఏప్రిల్ 14-2022 విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా విడుదల కోసం చిత్ర అభిమానులు హీరో యశ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి పోటీగా మరెన్నో సినిమాలు కూడా విడుదల కాబోతున్నట్లు గా సమాచారం. మరి అలా విడుదలైన చిత్రాల్లో ఏ సినిమా నిలబడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: