హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు , హెబ్బా పటేల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో తన అంద చందాలతో , నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హెబ్బా పటేల్ కు కుమారి 21ఎఫ్ సినిమా సినిమా విజయం తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా హెబ్బా పటేల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని సాధించింది, ఈ సినిమాను మినహాయిస్తే కుమారి 21 ఎఫ్ మూవీ తర్వాత హెబ్బా పటేల్ నటించిన ఏ సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన రెడ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించిన హెబ్బా పటేల్ ఈ సాంగ్ తో ప్రేక్షకులను అలరించింది, ఇలా సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. కొన్నాళ్ల కిందట బొద్దుగా తయారై, ఇటీవల ఎంతో నాజూకుగా కనిపిస్తున్న హెబ్బా పటేల్ తాజాగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియా చిట్ చాట్ నిర్వహించింది, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి..? అని హెబ్బా పటేల్ ని ఓ అభిమాని అడగగా... అదో పెద్ద సీక్రెట్ అంటూ హెబ్బా పటేల్ సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదని హెబ్బా పటేల్ పేర్కొంది, తన అందం కొంత దేవుడు ఇస్తే, మరి కొంత డాక్టర్ల చలవ వల్ల వచ్చిందని హబ్బా పటేల్ తెలియజేసింది, ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమాని అడిగిన ప్రశ్నకు హెబ్బా పటేల్ అదిరిపోయే సమాధానం ఇచ్చింది.